April 14, 2026
Explore
రాయచోటిలో పల్లకి సేవ ఘనంగా నిర్వహణ

రాయచోటిలో పల్లకి సేవ ఘనంగా నిర్వహణ

April 14, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పల్లకి సేవలో పాల్గొన్న భక్తులు భక్తి పరవశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగినట్లు ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, కార్యనిర్వాహణాధికారి డి.వి. రమణారెడ్డి తెలిపారు.

Tags: raichoti lo pallaki service gangha management