తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల (శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 21న భోగి తేరు, ఏప్రిల్ 22న సాత్తుమొర, ఏప్రిల్ 23న గంధపొడి ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం భాష్యకార్ల వారికి బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో, సాయంత్రం పెద్ద వీధి ఉత్సవం వైభవంగా చేపడుతారు. అదేవిధంగా ప్రతిరోజు దివ్యప్రబంధ సేవాకాలం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.
Tags; Sri Bhashyakara Utsavam Begins at Sri Govindaraja Swamy Temple