July 22, 2026
Explore
396 జీవో రద్దు చేసేదాక పోరాటం

396 జీవో రద్దు చేసేదాక పోరాటం

July 22, 2026 | Andhra Pradesh

రెండవ రోజు డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేస్తూ 396 జీవో విడుదల చేసిందని, దానిని రద్దు చేసేదాక పోరాటం ఆగదని డాక్యుమెంట్‌ రైటర్లు హెచ్చరించారు. బుధవారం రెండవ రోజు సంఘ నాయకులు పూలత్యాగరాజు, రామమూర్తి ఆధ్వర్యంలో పెన్‌డౌన్‌ ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా త్యాగరాజు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ సేవలను ఆర్‌ఎస్‌కెలకు అప్పగిస్తే వేలాది మంది దస్తావేజులేఖర్లు ఉపాధి కోల్పోయి, వారి కుటుంబాలు వీధిన పడుతుందన్నారు. దస్తావేజులేఖర్ల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమాలు ఈనెల 31 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి , జీవోను రద్దు చేయాలని లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్‌కుమార్‌, ఖలీల్‌, మునిరాజచారి, రవిచంద్రరాజు, జ్యోతి, చంద్రశేఖర్‌, హరి, కుమార్‌, కృష్ణవేణి, నాగరాజు, మురళి, రమణ, గణేష్‌, సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:The struggle will continue until GO 396 is revoked.