పుంగనూరుముచ్చట్లు:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని తూర్పువెహోగసాల నుంచి బడుగుబలహీన వర్గాలు, మేధావులచే భారీ ర్యాలీని పట్టణ పురవీధుల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకున్న అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి , ఘన నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Ambedkar Jayanti Rally on the 14th