రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం సూర్యనారాయణపురానికి చెందిన రాజ్ కుమార్ (25) కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిగ్గుబండి పని చేసే ఇతడు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఏఎస్ఐ గోపినాయక్ తెలిపారు. మంగళవారం రాత్రి నొప్పి తీవ్రం కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ఆస్పత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Unable to bear stomach pain, young man commits suicide