మంగళగిరి ముచ్చట్లు:
బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ BCY పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ చేపట్టని ఆమరణ దీక్షాప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 3రోజులుగా రామచంద్రయాదవ్ దీక్షచేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో పాటు రామచంద్రయాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్న క్రమంలో కార్యకర్తలు పలు బీసీ నేతలు హైవే పై నిరసన తెలిపారు. నేషనల్ హైవే పై వాహనాలు నిలుపుదల చేసి.. అక్కడ పడిఉన్న చెట్లకు నిప్పు పెట్టారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Tags; High Tension on the Mangalagiri National Highway.