April 13, 2026
Explore
మే 01 నుండి 9వ‌ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 01 నుండి 9వ‌ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

April 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 01 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

01-05-2026

ఉదయం – ధ్వజారోహణం( మేష‌లగ్నంలో ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి – పెద్దశేష వాహనం

02-05-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

03-05-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

04-05-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

05-05-2026

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

06-05-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

07-05-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

08-05-2026

ఉదయం – రథోత్సవం ( ఉద‌యం 6 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – ఆర్జితకల్యాణోత్సవం ( సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి – అశ్వవాహనం

09-05-2026

ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 11.30 నుండి 11.45 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి – ధ్వజావరోహణం ( రాత్రి 7.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 8వ తేదీన సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Tags: The annual Brahmotsavams of Sri Vedanarayana Swamy will be held from May 1st to May 9th.