పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు మహ్గత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం దర్గాను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో దువ్వ చేశారు. కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సైతం ముస్లింలు దర్గాకు చేరుకుని దువ్వ చేశారు. ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తాన, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్, ఇంతేజుర్‌రిష్టి లచే ఖవ్వాలి పాటల పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో ముస్లింలు హాజరైయ్యారు. యువత కేరింతలతో ఖవ్వాలి పాటలు ప్రజలను ఉర్రుతలూగించింది. ఉరుసు మహ్గత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులు రావడంతో వారికి దర్గాకమిటి వారు వసతి, అన్నదానం చేపట్టారు. వేలాది మంది కులమతాలకతీతంగా ఉరుసులో పాల్గొన్నారు.

Tags; Qawwali Singing Competitions in Full Swing at the Urs