April 12, 2026
Explore
యూపీఐ పేమెంట్స్‌కు పదేళ్లు పూర్తి.. 49 శాతం వాటాతో భారత్‌దే అగ్రస్థానం..!

యూపీఐ పేమెంట్స్‌కు పదేళ్లు పూర్తి.. 49 శాతం వాటాతో భారత్‌దే అగ్రస్థానం..!

April 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

❇️భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీల్లో ఏకంగా 49 శాతం వాటాతో భారత్ (India) అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. గణాంకాల ప్రకారం.. కేవలం 2026 జనవరి నెలలోనే యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.28.33 లక్షల కోట్లు.

❇️దేశంలోని మొత్తం రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో 81 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.

Tags: UPI Payments Complete 10 Years—India Takes the Top Spot with a 49% Share!