April 11, 2026
Explore
చీమనపల్లె దర్గాలో ఉరుసు మహోత్సవం

చీమనపల్లె దర్గాలో ఉరుసు మహోత్సవం

April 11, 2026 | Uncategorized

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం దర్గాను విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో దువ్వ చేశారు. కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సైతం ముస్లింలు దర్గాకు చేరుకుని దువ్వ చేశారు. ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తాన, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్‌, ఇంతేజుర్‌రిష్టి లచే ఖవ్వాలి పాటల పోటీలు ప్రజలను ఉర్రుతలూగించింది. ఖవ్వాలి పాటలను, ముస్లింల మతబోదనలను ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఉరుసు మహోత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులకు దర్గాకమిటి వారు అన్నదానం చేపట్టారు. ఉరుసు మహోత్సవానికి కులమతాలకతీతంగా హిందూముస్లిం సోదరులు పాల్గొనడం మత సామరస్యానికి చీమనపల్లె ఉరుసు ప్రతీకగా నిలిచింది.

Tags; Urs Festival at Cheemanapalle Dargah