అమరావతిముచ్చట్లు:
ఆధార్ కార్డు నిత్య జీవితంలో తప్పనిసరిగా మారింది. మరణించిన వారి ఆధార్ కార్డులు దుర్వినియోగం కాకుండా, సైబర్ మోసాలు, ఆర్థిక లావాదేవీల దుర్వినియోగం వంటి ప్రమాదాలను నివారించేందుకు UIDAI ఆన్‌లైన్‌లోనే ‘డీయాక్టివేట్’ చేసే ప్రక్రియను తీసుకొచ్చింది. ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆధార్‌తో లాగిన్ అయి, ‘Report Death of a Family Member’ ఆప్షన్‌ను ఎంచుకుని, మరణించిన వ్యక్తి వివరాలు, మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి. UIDAI ధృవీకరించిన తర్వాత మృతుడి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.
Tags; Here is how to deactivate a deceased person’s Aadhaar online!