తిరుపతి ముచ్చట్లు:
- సమాజ మార్పుకు ఆయన ఆలోచనలు చిరస్మరణీయం – జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,
- తిరుపతి, ఏప్రిల్ 11: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు పూలే చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
- ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో విద్యా విస్తరణకు, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు.
- అన్యాయాలు, అసమానతలను నిర్మూలించే దిశగా పూలే ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని అన్నారు.
- ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన) రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు) శ్రీనివాసులు (క్రైమ్స్) శ్రీనివాస రావు (సాయుధ దళం) మరియు పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని పూలే స్ఫూర్తితో ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Tags; Humble tributes on the occasion of Mahatma Jyotirao Phule’s birth anniversary.