అమరావతిముచ్చట్లు:
చంద్రుడి చుట్టూ యాత్రను విజయవంతంగా ముగించుకొని ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. భారత కాలమాన ప్రకారం.. ఉ.5.38 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో వారి ‘ఒరాయన్’ క్యాప్సూల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ యాత్ర భూమి నుంచి అత్యంత దూరం (4,06,773 కిలోమీటర్లు) ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా చరిత్ర సృష్టించింది. వ్యోమగాములు చంద్రుని చుట్టూ తిరిగి, అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు.
Tags: ‘Artemis-2’ astronauts have reached Earth.