మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రూ.1 లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అదనపు ఎస్పీ వెంకటాద్రి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో పరారీలో ఉన్న నిందితులను శనివారం బసినికొండ పంచాయతీ పరిధిలో తనిఖీల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి అనుమానాస్పదంగా పారిపోతుండగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. వీరిని పాత కేసులో నిందితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
Tags: Marijuana Racket Busted: Four Gang Members Arrested