విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Fire breaks out in private travel bus; completely gutted.