సదుం ముచ్చట్లు:
సదుం మండలంలో వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద రెడ్డెమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె మధ్యాహ్నం నిద్రిస్తుండగా ఎవరో తలుపు తట్టడంతో లేచి తీసింది. బురఖా ధరించిన వ్యక్తి మొహంపై కారం కొట్టి మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్ లాక్కొనివెళ్లారు. ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి విచారిస్తున్నారు.
Tags; Gold Chain Stolen from Elderly Woman’s Neck