April 10, 2026
Explore
ఇటీవలే ఓ సర్వేలో తేలిన విషయాలు…

ఇటీవలే ఓ సర్వేలో తేలిన విషయాలు…

April 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

11% శాతమే 60 దాటుతున్నారు ..

7% శాతం మాత్రమే 65 దాటి 70కి రీచ్ కాగలుగుతున్నారు..

5% శాతం మాత్రమే 80కి రీచ్ కాగలుగుతున్నారు..

3% శాతం మాత్రమే 80 దాటగలుగు తున్నారు.

అధిక మరణాల సంఖ్య 70-80 మధ్యనే ఉంటోంది.

50-55 దాటినవారు కూడా ఈ డేటాని గమనించాలి.

ఐనా..‌ వర్రీ ఫ్రీ & టెన్షన్ ఫ్రీ లైఫ్ కి ఈ సింపుల్ సూత్రాలు పాటించండి..

1) సంతోషమే సగం బలం.. ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి..

2) కోపం, ద్వేషం, ఆవేశం, అహంకారం.. ఈ దుష్టచతుష్టయాన్ని వదిలేయండి..

3) స్వీట్ & సాల్ట్ బాగా తగ్గించేయండి..

4) ఇంటి ఇలవేలుపు, ఇష్ట దైవం పై నమ్మకం పెంచుకోండి..

5) కడుపులో ఎప్పుడూ మంచి నీరు ఉండేలా చూసుకోండి. యూరినేషన్ ఐన తరువాత ఓ అరగ్లాసు మంచి నీళ్ళు తాగడం మరువకండి..

6) వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్.. సమయం క్రమం తప్పకుండా వీటిలో ఒకటి రెండు చేస్తుండండి..

7) అరగంట కోసారి కదలిక ఉండేలా చూసుకోండి..

8) ఈట్ టు లివ్. పిండి పదార్థాలు తగ్గించి ప్రొటీన్లు విటమిన్లు ఎక్కువగా తీసుకోండి..

9) కాఫీ ఐనా టీ ఐనా రోజుకి మూడు సార్లు మించకుండా తీసుకోండి అలవాటు ఉంటే..

10) మోహాలు వ్యామోహాలు వదిలేయండి..

11) ఆరోగ్యం సహకరించినంత వరకు సంవత్సరానికి రెండుసార్లు ఊళ్ళకి యాత్రలకి వెళుతుండండి. ఫారిన్ టూర్స్ తగ్గించండి..

12) ఎవరినీ విమర్శించకండి ద్వేషించకండి..

13) పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు గనుక వారి విషయంలో జోక్యం చేసుకోకండి. అడిగితేనే సలహాలు సూచనలు ఇవ్వండి..

14) అందుబాటులో ధ్యాన కేంద్రాలు ఉంటే వెళుతుండండి..

15) బిగుసుగా ఉండే బట్టలు వేసుకోకండి..

16) ఉన్న అభిరుచులను (హాబీలు) పెంచుకోండి. మెదడుకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకు, చేస్తుండండి..

17) మనసుకు నచ్చిన పుస్తకాలు చూడండి/చదవండి..

18) సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయవద్దు.. ఎస్కలేటర్లు వాడవద్దు..

19) హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా చేసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తుండండి..

20) ఓల్డ్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ మీ వయసువారితో షేర్ చేసుకుంటుండండి..

21) చివరిగా ఎప్పుడూ పాజిటివ్ దృక్పథం తోనే ఉండండి..

— ఇవి మనో వైద్యులు అందించిన సూత్రాల సంకలనం..

భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ నంబర్ 14567 ను ఏర్పాటు చేసింది అని మీ అందరికీ తెలియజేయదలచాను. (దయచేసి ఏ ఏరియా కోడ్ లేకుండా, ఎలాంటి ప్రిఫిక్స్ లేకుండా నేరుగా 14567 డయల్ చేయండి).

నేను ఈ నంబర్‌కు కాల్ చేసి చూడగా, ఒక మహిళ చాలా మంచి స్పందన ఇచ్చారు — నిజంగా ఎంతో సంతోషంగా అనిపించింది.

ఈ కేంద్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీనియర్ సిటిజన్లకు అవసరమైన సహాయం/మద్దతు అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లు కష్టంలో ఉన్న సందర్భాలు, వైద్య సహాయం అవసరం, వేధింపుల నుండి రక్షణ, సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారం వంటి విషయాలకు దీనిని ఉపయోగించవచ్చు.

స్పందించిన వ్యక్తి ఎంతో శ్రద్ధగా, ఆందోళనతో మాట్లాడి తక్షణ సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం చాలా ఇంప్రెస్ చేసింది.

గమనిక: ఈ సేవ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది హర్యానా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. (ఆ రెండు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు, కానీ త్వరలో ప్రారంభమవుతుంది.)
దయచేసి మీ వర్గంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు (స్నేహితులు, బంధువులు, పొరుగువారు మొదలైన వారికి) ఈ మెసేజ్‌ను పంపి, షేర్ చేయండి.

ఇది భారత ప్రభుత్వం తీసుకున్న గొప్ప ముందడుగు మరియు సహాయం అవసరమైన సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
చాలా సమాచారం కలిగినది, ఇది పనిచేస్తోంది.

Tags: Findings revealed in a recent survey…