April 10, 2026
Explore
ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం

ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం

April 10, 2026 | Andhra Pradesh

.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమెరికా ముచ్చట్లు:

అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఊహించని దౌత్యపరమైన చిక్కు ఎదురైంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ “జాతి నిర్మూలన”కు పాల్పడుతోందంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించడంతో, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు జరగాల్సి ఉండగా, ఖవాజా అసిఫ్ సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. “ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం. పాలస్తీనా భూభాగంలో ఏర్పడిన ఈ క్యాన్సర్ లాంటి దేశాన్ని సృష్టించిన వారు నరకంలో కాలిపోవాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు. గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో ఇజ్రాయెల్ రక్తపాతం సృష్టిస్తోందని ఆరోపించారు.

అసిఫ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇవి అత్యంత దారుణమైనవని, తమ దేశ వినాశనాన్ని కోరేలా ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. “శాంతి మధ్యవర్తిగా చెప్పుకుంటున్న దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించలేం”

Tags: Israel is a wicked country, a curse upon humanity.