April 9, 2026
Explore
ఆటోడ్రైవర్‌ అఫ్సర్‌కు సన్మానం

ఆటోడ్రైవర్‌ అఫ్సర్‌కు సన్మానం

April 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మున్సిపల్‌ బస్టాండ్‌లో ఆటో నడుపుకుని జీవిస్తున్న ఆటో సంఘ అధ్యక్షుడు అఫ్సర్‌బాషా తన నిజాయితిగా దొరికిన డబ్బులు ఇచ్చినందుకు ఆయనను సీఐ సుబ్బరాయుడు సన్మానించి, అభినందించారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఆటో డ్రైవర్లతో సీఐ సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు అఫ్సర్‌బాషాను ఆదర్శంగా తీసుకుని , జీవనం సాగించాలని కోరారు. కాగా బుధవారం మండలంలోని పెద్ద అలసాపురంకు చెందిన జయమ్మ తన పర్సులోని రూ.21 వేలు నగదును పొగొట్టుకుంది. ఆటో డ్రైవర్‌ ఆపర్సు, నగదును ఆమెకు అందజేసిన విషయం విధితమే.

Tags: Auto Driver Afsar Honored