- వైఎస్సార్‌సిపి నేతల ఫిర్యాదు
పుంగనూరు ముచ్చట్లు:
మహిళలను కించపరచి , అసభ్యంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ పై కేసులు నమోదు చేసి , ఏబిఎన్ ఛానల్‌ను సీజ్ చేయాలని వైఎస్సార్‌సిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, పార్టీ జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో వైఎస్సార్‌సిపి నాయకులు స్థానిక ప్రైవేటు బస్టాండ్ నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్ చేరుకున్నారు. సీఐ సుబ్బరాయుడుకు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సిపి నాయకులను, కార్యకర్తల ఇంటిలోని మహిళలను అసభ్యంగా మాట్లాడిన రాధాకృష్ణ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళా నాయకురాలు రషీద మాట్లాడుతూ సంస్కారం లేకుండ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఛానల్ ఉందని అహంకారంతో మహిళలను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని , తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు ఖాదర్, కిజర్‌ఖాన్, నటరాజ, రాజేష్, హేమంత్ సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మమ్ము, అస్లాం, రఫిక్, సుబ్బన్న, నజీర్, వినయ్, ఆనంద, బాబు, రమణ, ఖాజా, చిరంజీవి, నయాజ్, కంచి, మునిరత్నం, తదితరులు పాల్గొన్నారు.

Tags: Cases must be registered against Radhakrishna for disparaging women.