పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కదంతొక్కారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ , ర్యాలీ ఇందిరా సర్కిల్ నుంచి ఎంబిటి రోడ్డు, బస్టాండ్, గోకుల్ సర్కిల్ మీదుగా సాగింది. ఈసందర్భంగా సంఘ జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకుండ నిర్లక్షం చేస్తోందన్నారు. దేశభవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్య పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కల్పించాల్సిన హక్కులను తక్షణమే అమలు చేయాలన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని , చట్టాన్ని అమలు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు భార్గవ్‌సాయి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రతినిదులు కోటేశ్వరరావు, వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, మున్న, ఓబీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు వెంకటయాదవ్ , సురేష్, పవన్, మునిసాయి తదితర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Tags: Students rallied, demanding the effective implementation of the Right to Education Act.