పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన లక్షలాది రూపాయలు విలువ చేసే మూడు అంగడి రూములను కొందరు మంగళవారం రాత్రి జెసిబిలతో నేలమట్టం చేశారు. బుధవారం స్థానిక ప్రజలు గమనించి ఆందోళన చేపట్టారు. 30 సంవత్సరాల క్రితం ఆలయానికి దాత లు ఇచ్చిన అంగడి రూముల స్థలానికి విలువ రావడంతో కొంత మంది దీనిపై కన్నేసి అర్ధరాత్రిలో కూల్చివేసి ఆస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రూములు కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని , ఆలయ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
Tags: Demolition of Temple Rooms