April 8, 2026
Explore
ఆటోడ్రైవర్‌ నిజాయితీ

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

April 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని మున్సిపల్‌ బస్టాండ్‌లో ఆటో నడుపుకుని జీవిస్తున్న ఆటో సంఘ అధ్యక్షుడు అఫ్సర్‌బాషా తన నిజాయితి నిరూపించుకోవడంతో సీఐ సుబ్బరాయుడు అభినందించారు. బుధవారం బస్టాండ్‌లో ఉండగా మండలంలోని పెద్ద అలసాపురంకు చెందిన జయమ్మ తన పర్సును పోగొట్టుకుంది. ఇలా ఉండగా ఆపర్సు ఆటో డ్రైవర్‌ అఫ్సర్‌కు దొరికింది. పర్సును పరిశీలించగా అందులో రూ.21 వేలు నగదు , అడ్రస్సు ఉండటంతో అఫ్సర్‌ వెంటనే బాధితురాలికి ఫోన్‌ లో సమాచారం అందించి, నగదు ఉన్న పర్సును సీఐ సుబ్బరాయుడుకు అందించారు. ఆయన బాధితురాలికి పర్సును అందజేసి ఆటోడ్రైవర్‌ అఫ్సర్‌బాషాను అభినందించారు.

Tags: The Auto Driver’s Honesty