4 గంటలు ఆలస్యంగా గుణుపూర్ – కటక్ మెమో ఎక్స్‌ప్రెస్
గుణుపూర్ రైలు ప్రయాణికులకు తప్పని తిప్పలు
రైల్వే ప్రయాణికులకు మరోసారి నిరీక్షణ తప్పలేదు. గుణుపూర్ నుంచి కటక్ వెళ్లాల్సిన గుణుపూర్ – కటక్ మెమో ఎక్స్‌ప్రెస్ (Gunupur – Cuttack MEMU) బుధవారం చాలా ఆలస్యంగా నడుస్తోంది. నిర్దేశిత సమయం కంటే సుమారు నాలుగు గంటల పాటు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ఉద్యోగులు, విద్యార్థులు మరియు అత్యవసర పనుల నిమిత్తం కటక్ వెళ్లే రోగులు స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ప్లాట్‌ఫారమ్‌లపై వేచి ఉండటం చిన్న పిల్లలు, వృద్ధులకు నరకప్రాయంగా మారింది.సాంకేతిక కారణాల వల్ల లేదా మార్గమధ్యంలో జరుగుతున్న రైల్వే పనుల వలనే ఈ ఆలస్యం చోటుచేసుకున్నట్లు సమాచారం.
Tags; Inevitable Hardships for Train Passengers