July 11, 2026
Explore
శెట్టి ఆత్మకూర్ లో వ్యక్తి దారుణ హత్య

శెట్టి ఆత్మకూర్ లో వ్యక్తి దారుణ హత్య

July 11, 2026 | Andhra Pradesh

శెట్టి ఆత్మకూర్ ముచ్చట్లు:

పాత కక్షల నెపంతో ఒకరిని హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూర్ లో‌చోటు ఛేసుకుంది. గ్రామానికి చెందిన సంధ్యా రాజు (45) కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళను అపహరించి, వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ భర్తను మృతుడు గతంలోనే హత్య చేసి జైలుకు సైతం వెళ్లాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాజును గుర్తుతెలియని వ్యక్తులు పాత కక్షలు మనుస్సులో పెట్టుకుని పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ శ్రీను, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Tags; Man brutally murdered in Shetti Atmakur