తిరుమల ముచ్చట్లు:
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలిగోపురాన్ని దాటిన తర్వాత నడకదారిలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. భక్తుల అరుపులు, రద్దీ కారణంగా చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్రమత్తమైన అటవీశాఖ, టీటీడీ అధికారులు నడకమార్గంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
Tags; Leopard sighting causes panic on Tirumala footpath; pilgrims scramble to safety.