శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసుల చర్యలు….కడప ఇంచార్జ్ డి.ఎస్.పీ ఇ .బాలస్వామి రెడ్డి
కడప ముచ్చట్లు:
కడప నగరంలో ఒక రాజకీయ పార్టీ కి చెందిన వారిని హౌస్ అరెస్ట్ చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు చర్యలు చేపట్టడం జరిగిందని కడప ఇంచార్జ్ డి.ఎస్.పీ ఇ .బాలస్వామి రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.మాజీ ఉపముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా, కడప మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఓ కేసుకు సంబంధించి కడప కోర్టుకు కూడా హాజరయ్యారని, నిర్బంధించినట్లు మీడియా అవాస్తవ కథనాలు ప్రసారం చేయడం సరి కాదని కడప ఇంచార్జ్ డి.ఎస్.పీ ఇ .బాలస్వామి రెడ్డి తెలిపారు. పోలీసులు ఎవరినీ నిర్బంధించలేదని కడప ఇంచార్జ్ డి. ఎస్.పీ తెలిపారు.
Tags; No one has been placed under house arrest.