March 10, 2026
Explore
పుంగనూరులో జాతర సంత

పుంగనూరులో జాతర సంత

March 10, 2026 | Uncategorized

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మంగళ, బుధవారాలలో రెండు రోజుల పాటు వైభవంగా జరగనున్నది. తొలిరోజు మంగళవారం అమ్మవారికి జంతుబలులు ఇచ్చేందుకు గొర్రెల సంత నిర్వహించారు. కర్నాటక, తమిళనాడు ర్ఖా•ల నుంచి వందలాది గొర్రెలను వ్యాపారులు సంతకు తరలించారు. ఒకొక్క గొర్రె లక్షరూపాయల వరకు ధర పలికింది. జాతరలో అమ్మవారికి వెహోక్కులు చెల్లించేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై గొర్రెపిల్లలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా పట్టణం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. ఎటుచూసిన ప్రతి ఇంట బంధుమిత్రల రాకతో జాతర సందడి నెలకొంది.

భారీ బందోబస్తు….

పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటలు చోటు చేసుకోకుండ జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిలి ఆధ్వర్యంలో అడిషినల్‌ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు, పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. జేబిదొంగలు , చైన్‌ స్నాచింగ్‌లతో పాటు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ప్రత్యేక ఐడి పార్టీలను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

Tags: Fair in Punganur