-ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడమే నా ధ్యేయమని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య అన్నారు. మంగళవారం శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆరంభాకం ముని ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని తెలిపారు. న్యాయవాద హక్కుల పరిరక్షణ చట్టం కోసం, వెల్ఫేర్ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ బెనిఫిట్స్, వాలంటరీ రిటైర్మెంట్ తదితర విషయాలపై విశ్లేషణాత్మకంగా పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. న్యాయవాదులు సమైక్యంగా ఉండి సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తనని కలిసేందుకు ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తనను అఖండ విజయంతో గెలిపించిన న్యాయవాదులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆరంభాకం ముని ప్రసాద్, ఉపాధ్యక్షులు కాకి చిన్న అంకయ్య, మునిశేఖర్, దేవి, మీర్జావలి, రాజేష్ రాయల్, సీనియర్ న్యాయవాదులు బీవీ. చలమయ్య, పివి. వెంకటాచలపతి, కన్నలి ప్రభాకర్ రెడ్డి, భక్తవత్సల నాయుడు, లోకనాథ్ రెడ్డి, మాజీ ఏపీపీ వీర రాఘవరెడ్డి, పార్థసారథి, దుష్యంత్ బాబు, మహిళా న్యాయవాదులు భీమేశ్వరి, ప్రజ్ఞ శ్రీ తో పాటు పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Tags: My objective is to resolve the problems faced by lawyers.