పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మిషన్ కాంపౌండులో గల స్థలంలో సిఎస్‌ఐ రాయలసీమ డయాలసిస్ బిషప్ ఐజెక్ వరప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం దక్షిణ కొరియాకు చెందిన జార్‌లాజిస్టిక్స్ అధినేత హ్హన్గ్ జంగ్‌యంగ్ వారిచే పేద విద్యార్థుల కోసం సకాల సౌకర్యాలతో పాఠశాల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ ఐజెక్ వరప్రసాద్ మాట్లాడుతూ ఎంతో కాలంగా చేపట్టాల్సిన కార్యక్రమం దక్షిణ కొరియా వారిచే సీఎస్‌ఐ మిషన్ కాంపౌండ్‌లో పాఠశాల ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకోవడం అదృష్టమన్నారు. త్వరలోనే కొరియా బృందంచే ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ చైర్మన్ ఆనందబాబు, ఫాస్టర్ రాఖేష్‌నిమ్రోద్, జాయింట్ సెక్రటరీ న్యాసి, కార్యదర్శి రవికుమార్, సభ్యులు భక్తవత్సలం, సురేష్, క్రిష్టఫర్, ఉదయ్‌కుమార్, ఫాస్టర్లు, సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు.
Tags: A school will soon be established by South Koreans.