పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అని నేషనల్ మజ్ధూర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దయాబాబు అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ప్రగతిభవన్‌లో ఆర్టీసి ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. స్థానిక డిపోలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తమ చేశారు. వీటిని పరిష్కరించేందుకు కార్యచరణ ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి , పరిష్కరించకపోతే ఉధ్యమాల బాట పడుతామని తెలిపారు.
Tags: The goal is to resolve the issues of RTC employees.