మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె: భారత ప్రభుత్వం తక్షణమే కుల వ్యవస్థను రద్దు చేయాలని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కుల నిర్మూలన అత్యవసరమని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వర్గాల ఆధిపత్య ధోరణిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే కుల రహిత సమాజం ఏర్పడాలని ఆయన స్పష్టం చేశారు.
Tags: The Caste System Must Be Abolished — Bharatiya Ambedkar Sena Demands