April 7, 2026
Explore
లయన్స్ క్లబ్‌చే విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ

లయన్స్ క్లబ్‌చే విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ

April 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌, ఇన్‌ట్యాక్‌ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ కన్వీనర్‌ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్థానిక జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల, మున్సిపల్‌ హైస్కూల్‌ కొత్తయిండ్లలో కలసి రెండు ప్రాంతాలలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ పేర్లను సెల్‌నెంబరు: 9581158900 కు కాల్‌ చేసి నమోదు చేసుకుని శిక్షణ పొందాలని సూచించారు. శిక్షణ పొందిన వారికి సర్టిపికెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Tags: Computer Training for Students by the Lions Club