September 11, 2026
Explore
ఎంపీ మిధున్‌ జన్మదిన వేడుకలు

ఎంపీ మిధున్‌ జన్మదిన వేడుకలు

September 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజన్న విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపి రెడ్డెప్ప, మిధున్‌ యువసేన అధ్యక్షుడు రాజేష్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. మిధున్‌రెడ్డి జిందాబాద్‌….పెద్దిరెడ్డి జిందాబాద్‌ ….జగనన్న జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. మాజీ ఎంపి రెడ్డెప్ప మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గ ప్రజల తరపున ఎంపి మిధున్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాం ఎంపిపి భాస్కర్‌రెడ్డి, జిల్లా యూత్‌వింగ్‌ కార్యదర్శి కొత్తపల్లె చెంగారెడ్డి , సీమ జిల్లాల మైనార్టీసెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పట్టణ , రూరల్‌ అధ్యక్షులు ఇర్ఫాన్‌, అమరనాథరెడ్డి, నాయకులు మురుగప్ప, ఖాదర్‌, రాజశేఖర్‌రెడ్డి, హేమంత్‌, మమ్ము, కృపాకర్‌, నటరాజ, సూరి, గౌసి, సుబ్రమణ్యం, జెపియాదవ్‌, ఆర్‌కె.రామకృష్ణ, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: MP Mithun’s birthday celebrations