April 7, 2026
Explore
మనసులు కలవడం తప్ప ప్రేమకు ఒడ్డూ పొడుగు వంటివి ఉండవు

మనసులు కలవడం తప్ప ప్రేమకు ఒడ్డూ పొడుగు వంటివి ఉండవు

April 7, 2026 | Andhra Pradesh

మచిలీపట్నాo ముచ్చట్లు:

మనసులు కలవడం తప్ప ప్రేమకు ఒడ్డూ పొడుగు వంటివి ఉండవని మచిలీపట్నానికి చెందిన ఈ ప్రేమికులు నిరూపించారు.

స్థానిక రాజుపేటకు చెందిన షేక్ గౌసియా, వేముల శశి కలిసి చదువుకున్నారు.

ముందు స్నేహితులైనా క్రమంగా వారి బంధం ప్రేమగా మారింది.

చిరుద్యోగాలు చేస్తున్న వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోగా పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు.

ఇద్దరూ మేజర్లు కావడంతో రక్షణ కల్పించాలని సోమవారం పోలీసులను ఆశ్రయించగా వారు పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

Tags: Apart from the union of hearts, love has no physical attributes like height or build.