హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనము నుండి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ నుండి ఒడిస్సా, తెలంగాణ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలోని దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది. నిన్న తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈరోజు బలహీన పడింది.
👉రాగల 3 రోజులకు వాతావరణ సూచన:
మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తదుపరి క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Tags: Weather Analysis and Warnings for Telangana State for the Next Three Days: