-పదవి లేకున్నా ప్రజాసేవలో
-ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం
- మాజీ సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:- పంచాయతీ ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని కేసిపల్లి మాజీ సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని కేసిపల్లి పంచాయతీ గుంతయంబాడి గ్రామంలో గత కొన్ని నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండడంతో గ్రామస్తులు మాజీ సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తన స్వంత నిధులు వెచ్చించి గుంతయంబాడి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామన్నారు. నీటి ఎద్దడి తగ్గే వరకు తాగునీరు ప్రజలకు అందిస్తామన్నారు. పంచాయతీ ప్రజలు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తెస్తే…వాటిని ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులురెడ్డికు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: Free drinking water supply