April 7, 2026
Explore
డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ

డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ

April 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వేడుకకు హాజరైన లోకేశ్… ఫొటోలు ఇవిగో!

ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న విజయవాడలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. టీడీపీ నేత, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకలో ఆయన పాల్గొన్నారు.

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో డూండి రాకేశ్ కుమారుడు సాయి సీతారామ్, కుమార్తె లక్ష్మీ కుసుమలను మంత్రి నారా లోకేశ్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన వేడుకకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి లోకేశ్ కార్యక్రమానికి హాజరవ్వడంపై డూండి రాకేశ్ కుటుంబం, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. పిల్లలిద్దరినీ ఆశీర్వదిస్తున్న చిత్రాలను ఆయన పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన లోకేశ్… ఫొటోలు ఇవిగో!

ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న విజయవాడలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. టీడీపీ నేత, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకలో ఆయన పాల్గొన్నారు.విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో డూండి రాకేశ్ కుమారుడు సాయి సీతారామ్, కుమార్తె లక్ష్మీ కుసుమలను మంత్రి నారా లోకేశ్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన వేడుకకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి లోకేశ్ కార్యక్రమానికి హాజరవ్వడంపై డూండి రాకేశ్ కుటుంబం, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. పిల్లలిద్దరినీ ఆశీర్వదిస్తున్న చిత్రాలను ఆయన పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

Tags: Presentation of New Clothes to Dundi Rakesh’s Son and Daughter