April 6, 2026
Explore
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

April 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో సమావేశాన్ని్య ధ్యక్షుడు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పిఆర్‌సి అరియర్స్ ఇవ్వాలన్నారు. 15 శాతం అదనపు పెన్షన్‌ అందించాలని, కమ్యూటేషన్‌ పిరియడ్‌ 15 నుంచి 12 ఏళ్లకు తగ్గించాలన్నారు. 12వ పిఆర్‌సి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు రాజగోపాల్‌రెడ్డి, శంకరయ్య, సురేంద్రరెడ్డి, మురళి, రామమూర్తి నాయుడు లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గంగులమ్మ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags;The issues of retired employees must be resolved.