పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్లలో ఆదివారం రాత్రి శ్రీ సీతారామ సమేత శ్రీరాములవారి పుష్పపల్లకి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సాయంకాల సమయంలో శాస్త్ర పద్దతిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించిన పల్లకిపై స్వామివారిని ఆసీనులుగా ఉంచి గ్రామవీధుల్లో మంగళ వాయిద్యాలు, చెక్కభజనలు , వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్దలతో అడుగడుగునా మహామంగళహారతులు సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు దొరబాబు, రోహిత్‌రెడ్డి, హరి, పవన్, మంజు తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand Procession of Sri Sita and Rama