మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
స్థానిక జగన్ కాలనీలో నివసిస్తున్న మైనర్ బాలుడు దీక్షిత్‌ను శనివారం బైక్ రేసర్లు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగింది. గాయపడిన బాలుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వార్త ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. అనంతరం బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tags: Case Registered Against Bike Racers