సంబేపల్లె ముచ్చట్లు:
సంబేపల్లె మండలంలోని దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్లపల్లెకు చెందిన సలీంద్ర అనిల్ కుమార్ (25) అనే యువకుడు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న అనిల్ కుమార్‌కు నాలుగేళ్ల క్రితం నిమ్మనపల్లెకు చెందిన మదనశోభతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ప్రస్తుతం భార్యాపిల్లలు నిమ్మనపల్లెలో ఉంటుండగా, తండ్రి మరణించడం, తల్లి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లడంతో అనిల్ కుమార్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు తలుపులు తీయకపోవడంతో గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Young man commits suicide, unable to bear the loneliness.