అమరావతిముచ్చట్లు:
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
పీఎం ఈ-డ్రైవ్ తొలిదశలో 135 చోట్ల ఏర్పాటు
కారు, బైక్, ఆటోలు, భారీ వాహనాల ఛార్జింగ్‌కు సదుపాయాలు
ఏప్రిల్‌లో టెండర్లు పిలిచేందుకు నెడ్‌క్యాప్ సిద్ధం
రాష్ట్రంలో నేషనల్ హైవే వెంట 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం దశలవారీగా 444 ఛార్జింగ్ కేందాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రూపొందించింది. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కంల దగ్గర అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపారు. కేంద్ర బృందం సుమారు 200 ప్రదేశాలను పరిశీలించింది.
ఒక్కొక్క ఛార్జింగ్ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 80 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన 20 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా డిస్కంలు సమకూర్చనున్నాయి. సప్లయ్,ఆపరేషన్, ఇన్స్టలేషన్ విధానంలో 5 ఏళ్ల పాటు వీటిని నిర్వహించేందుకు ఆపరేటర్లను టెండరు ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగం డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థ)లకు వెళ్తుంది. అందుచేత ఒప్పందం ప్రకారం కొంత మొత్తాన్ని ఆపరేటర్లకు చెల్లిస్తాయి.
రాష్ట్రంలో ఏటా సుమారు 6,000 కొత్త ఎలక్ట్రికల్ కార్లు, 4,000 ఆటోలు, 40 వేల ద్విచక్ర వాహనాలు రోడ్డెక్కుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. రాబోయే ఏడాదిన్నరలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో భారీ పెరుగుదల ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా నెడ్‌క్యాప్ అధికారులు ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధి చేయడం పై దృష్టి సారించారు.
Tags: 135 EV charging stations to be set up – steps to ensure availability by July and August!