March 10, 2026
Explore
దేశంలో మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. టాప్-3 ఏపీ నుంచే!

దేశంలో మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. టాప్-3 ఏపీ నుంచే!

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


దేశంలో 14 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లుగా గుర్తింపు

అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలు ఏపీ ఎమ్మెల్యేలవే

రూ.716 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మొదటి స్థానం

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 10 శాతమేనన్న ఏడీఆర్

తెలంగాణతో పోలిస్తే ఏపీ మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి చాలా అధికం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడీఆర్ ‘విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. ఈ నివేదిక ప్రకారం రూ.716 కోట్ల ఆస్తితో ప్రశాంతి రెడ్డి మొదటి స్థానంలో ఉండగా, కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి రూ.388 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. ఇక, నెల్లిమర్ల నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ 14 మంది మహిళా బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది.

Tags: Female billionaire representatives in the country.. Top 3 are from AP!