April 4, 2026
Explore
రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా

రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా

April 4, 2026 | Andhra Pradesh

అవినీతి మత్తులో రెవెన్యూ అధికారులు

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వేనెంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని కబ్జా చేశాడు. కొంత మంది రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాల ఫలితమే కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని బాహాటంగా కబ్జా చేశారు. శనివారం భూమి వద్ద ఉన్న క్వారీ యజమాని వెంకటేష్‌ ప్రభుత్వ భూమి 2.50 ఎకరాల భూమిని జెసిబిలతో చదును చేసి క్వారీలోకి కలుపుకున్నాడు. దీనిపై దళిత సంఘ నాయకులు రాజు, పెంచుపల్లి కృష్ణప్ప తదితరులు ఆప్రాంతాన్ని సందర్శించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజు మాట్లాడుతూ సదరు స్థలాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఇండ్ల పట్టాలకు మంజూరు చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కానీ రెవెన్యూ వారు పట్టించుకోకుండ క్వారీ యజమానితో లాలూచి పడటంతో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారని ఆరోపించారు. అధికారుల నిర్లక్షం, అక్రమాలతోనే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ తక్షణమే విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని కాపాడాలని , లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Tags: Government Land Worth Rs 2 Crore Encroached