April 4, 2026
Explore
అప్పులబాధతో వ్యక్తి మృతి

అప్పులబాధతో వ్యక్తి మృతి

April 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అప్పులబాధతో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శనివారం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సుల్తాన్‌సాబ్‌వీధిలో నివాసం ఉన్న మహమ్మద్‌రఫి (35) పలువురి వద్ద అప్పులు చేశారు. ఈ క్రమంలో అప్పులవారు వేదింపులకు గురి చేయడంతో వేదింపులు తాళలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్‌ఐ అన్సర్‌బాషా కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Man dies due to debt burden.