April 4, 2026
Explore
టీటీడీ చైర్మన్‌ బిఆర్‌నాయుడు రాజీనామ చేయాలి

టీటీడీ చైర్మన్‌ బిఆర్‌నాయుడు రాజీనామ చేయాలి

April 4, 2026 | Andhra Pradesh

లేదా ప్రభుత్వం తొలగించాలి

  • వైఎస్సార్‌సిపి నిరసన కార్యక్రమం
  • మాజీ ఎంపి రెడ్డెప్ప డిమాండ్‌

పుంగనూరుముచ్చట్లు:

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల-తిరుపతి ఆలయ బోర్డు చైర్మన్‌ బిఆర్‌నాయుడు అశ్లీల కార్యక్రమాలతో కలంకితుడైన తక్షణమే ఆయన రాజీనామ చేయాలని , లేదా ప్రభుత్వమే తక్షణమే తొలగించాలని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప డిమాండ్‌ చేశారు. శనివారం వైఎస్సార్‌సిపి పిలుపు మేరకు పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకట్రమణస్వామి ఆలయం వద్ద ఎంపిపి భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, పట్టణ , మండల పార్టీ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్‌తో పాటు వైఎస్సార్‌సిపి నాయకులు నిరసన తెలిపారు. రెడ్డెప్ప మాట్లాడుతూ బిఆర్‌నాయుడు ఛానల్‌ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు , నారాలోకేష్‌ లతో బిఆర్‌నాయుడు కుమ్మకైయ్యారని ఆరోపించారు. బిఆర్‌నాయుడు రాసలీలల వీడియోలు వైరల్‌ అవుతున్న ప్రభుత్వాధినేతలు సిగ్గులేకుండ వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. బిఆర్‌నాయుడుతో టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతోందని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని కొనసాగించడం మహిళలను అవమానపరచడమేనని ఆరోపించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పూలత్యాగరాజు, నటరాజ, భారతి, జెపి.యాదవ్‌, పార్టీ నాయకులు నరసింహులు, జయరామిరెడ్డి, రాజేష్‌, సురేష్‌, నరేష్‌, సుబ్రమణ్యం, బాబు, రమణ, రామకృష్ణ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: TTD Chairman B.R. Naidu must resign.