పుంగనూరుముచ్చట్లు:
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వెంకటపద్మలత, గాంధిబాబు లు శనివారం హెచ్చరించారు. డీఈవో సుబ్రమణ్యం, డొక్కాసీతమ్మ మధ్యాహ్నభోజనం అడిషినల్ డైరెక్టర్ రవికుమార్‌తో కలసి సభ్యులు పలు పాఠశాలలను సందర్శించారు. గత వారం నగరివీధిలోని యూపిస్కూల్‌లో భోజనంలో బల్లిరావడం, విద్యార్థులు అస్వస్థతకు గురికావడం విధితమే. దీనిపై సభ్యులు, అధికారులు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. అలాగే నక్కబండలో గల కస్తూరిభా పాఠశాల, అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌ను పరిశీలించారు. బాలికల హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను పలు విషయాలపై అడిగి తెలుసుకుమన్నారు. పాఠశాలలో మెను గూర్చి విచారించారు. వెంకటపద్మలత మాట్లాడుతూ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడరాదన్నారు. ఈ విషయాలపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నటరాజారెడ్డి, తహశీల్ధార్ రాము తదితరులు పాల్గొన్నారు.
Tags: Strict action will be taken against any negligence in the distribution of mid-day meals.