పుంగనూరుముచ్చట్లు:
- సమస్యలు ఉంటే 112 కు కాల్ చేయండి
- జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిలి పోలీస్‌కు ఆదేశాలు
శ్రీసుగుటూరు గంగమ్మజాతరకు వచ్చే వేలాది మంది భక్తులతో పోలీసులు మర్యాదగా మాట్లాడాలని, అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించడం చేయవద్దని జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిలి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి గంగజాతర ఏర్పాట్లపై ఆయన పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యంత చరిత్రాత్మకంగా జరిగే జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టామన్నారు. అవసరమైతే ప్రజలు 112కు కాల్ చేయాలన్నారు. పట్టణంలో ఎలాంటి పుకార్లు వచ్చిన నమ్మవద్దన్నారు. పట్టణం పూర్తి పోలీస్‌పహారాలో ఉంటుందని , ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండ ఉండేందుకు ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లీంచామని , ద్విచక్రవాహనాలు మినహా ఏ వాహనాన్ని పట్టణంలో అనుమతించబోమన్నారు. రెండు రోజుల పాటు జరిగే జాతరలో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజలు కూడ ఓర్పుతో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని , ఆవేషాలకు లోనుకావద్దని సూచించారు. పూర్తి స్థాయిలో సిసికెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి , నిఘా పెట్టామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటాద్రి, డిఎస్పీ కృష్ణమోహన్, సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌బాషా పాల్గొన్నారు.

Tags: Be polite to devotees.