గుంటుపల్లి ముచ్చట్లు:
1.75 టన్నుల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం, ఆపై రెవెన్యూ అధికారులకు అప్పగింత
పట్టుబడిన రేషన్ బియ్యం గుంటుపల్లి కి చెందిన అక్రమ రేషన్ వ్యాపారి పంది శేఖర్ వి గా గుర్తింపు
శేఖర్ ఎంతో కాలంగా అక్రమ రేషన్ వ్యాపారం నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో వెల్లువెత్తుతున్న విమర్శలు
పట్టుబడిన బియ్యం ను అదే గ్రామంలో ను రేషన్ డిపోకు తరలించడం పట్ల ప్రజల పెదవి విరుపు
అసలు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులకు బియ్యం వెళ్తుందే డిపోల నుంచి అని గుసగుసలాడుతున్న స్థానికులు
10రూపాయల నుండి 12 రూపాయల వరకూ లబ్ది దారులనుండి బియ్యం ను డీలర్లు కొనుగోలు చేసి 17రూపాయలకు స్థానిక వ్యాపారులకు అమ్ముతున్నట్లు సమాచారం
కేసు నమోదు చేయనున్నట్లు తెలిపిన ఎస్ ఐ సత్యవతి
Tags: SI Satyavati Raids Illegal Ration Stocks in Guntupalli